హైదరాబాద్ పాతబస్తీలో ATM వ్యాన్ నుంచి ₹17 లక్షల చోరీ, డ్రైవర్ స్నేహితులతో కలిసి పరార్
హైదరాబాద్‌లోని పాతబస్తీ సంతోష్‌నగర్‌లో ఓ ఎస్‌బీఐ ATM వద్ద నగదు నింపే వ్యాన్ డ్రైవర్ ₹17 లక్షల నగదుతో పరారయ్యాడు.
డ్రైవర్ చిర్రా శ్రీనివాస్ మరో వ్యక్తితో కలిసి ఈ చోరీకి పథకం వేశాడు. రాయంబజార్ రోడ్డుపై ఉన్న ATM వద్ద బ్యాంకు అధికారులు నగదు నింపబోతుండగా, వ్యాన్‌లో ఉన్న ₹17 లక్షలు తన స్నేహితుల సాయంతో ఎత్తుకెళ్లాడు. అనంతరం బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బ్యాంకు అధికారులు ఐఎస్ సదన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com