హైదరాబాద్ 24°C
అమరావతి 29°C
IST 9:04 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ బ్రేకింగ్

బండి భగీరత్ కేసు: బాధితురాలికి రెండు బర్త్ సర్టిఫికేట్లు — వయసుపై వివాదం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బండి భగీరత్ కేసు: బాధితురాలికి రెండు బర్త్ సర్టిఫికేట్లు — వయసుపై వివాదం
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్‌కు సంబంధించిన POCSO కేసులో కోర్టు విచారణ జరుగుతోంది. ఈ కేసులో బాధితురాలి వయసుపై కీలక వివాదం తలెత్తింది.

ఒక డాక్యుమెంట్లో బాధితురాలు మైనర్‌గా కనిపిస్తోంది. మరొక డాక్యుమెంట్లో — 2021లో నమోదైన ఒక కేసు chargesheet లో — ఆమె వయసు 15 సంవత్సరాలుగా నమోదైంది. ఆ లెక్కన ఇప్పుడు ఆమె వయసు 20 పైన ఉంటుందని వాదనలో పేర్కొన్నారు.

ఇంకొక కీలక అంశం: బాధితురాలికి రెండు birth certificates ఉన్నాయని తెలిసింది. ఒకటి హైదరాబాద్ GHMC MeeSeva ద్వారా జారీ అయింది — అందులో జన్మ సంవత్సరం 2008గా ఉంది. మరొకటి ఆదిలాబాద్ జిల్లా MeeSeva కేంద్రం ద్వారా జారీ అయింది — అందులో జన్మ సంవత్సరం 2010గా ఉంది. రెండు సర్టిఫికేట్లు ఆమె మైనర్ అనే చెప్తున్నాయి. అయితే ఒకే వ్యక్తికి రెండు చోట్ల నుంచి వేర్వేరు సంవత్సరాలతో birth certificates ఎలా జారీ అయ్యాయనే ప్రశ్న తలెత్తింది.

POCSO చట్టం ప్రకారం బాధితురాలి గుర్తింపు, ఫోటోలు బయట పెట్టడం నేరం. మీడియా, సోషల్ మీడియా — ఎవరైనా సరే ఆ వివరాలు బహిర్గతం చేస్తే వారిపై కూడా POCSO కింద కేసు నమోదవుతుంది.

బండి భగీరత్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు హాజరవుతానని mail పంపారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన హాజరు కావాల్సి ఉంది. కోర్టు నిర్ణయం కూడా ఈరోజు వెలువడే అవకాశం ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com