ఆంధ్రప్రదేశ్

గుంతకల్‌లో రోజ్‌గార్ మేళా: 120 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
గుంతకల్‌లో రోజ్‌గార్ మేళా: 120 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు
📷 Abhinav Tripathi / Pexels
షేర్ కాపీ అయింది ✓

అనంతపురం జిల్లా గుంతకల్‌లో రోజ్‌గార్ మేళా నిర్వహించారు. రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 120 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందచేశారు.

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నూతనంగా ఉద్యోగం పొందిన వారిని ఉద్దేశించి మాట్లాడారు.

నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్ అనే నినాదంతో పని చేయాలని బండి సంజయ్ కొత్త ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడకుండా నిజాయతీగా, నిబద్ధతతో పని చేయాలని సూచించారు. మోదీ 3.0 హయాంలో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా లబ్ది పొందుతుందని ఆయన పేర్కొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com