హైదరాబాద్ 26°C
అమరావతి 30°C
IST 3:12 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

నూజివీడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కిడ్నాప్ కేసు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నూజివీడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కిడ్నాప్ కేసు
📷 Santhosh KKR / Pexels
షేర్ కాపీ అయింది ✓

నూజివీడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడు బషీర్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. ఏలూరుకు చెందిన పొగాకు వ్యాపారి సూర్యచంద్రరావు, ఆయన కుమారుడిని కిడ్నాప్ చేసిన కేసులో బషీర్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

ముస్తఫా, సూర్యచంద్రరావు మధ్య రూ.93 లక్షల లావాదేవీల వివాదం ఉంది. సూర్యచంద్రరావు నుంచి రూ.93 లక్షల విలువైన పొగాకు సరుకు కొనుగోలు చేసిన ముస్తఫాకు రూ.60 లక్షల సరుకు మాత్రమే ఇచ్చారు. మిగతా మొత్తానికి సరుకు ఇవ్వాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా సూర్యచంద్రరావు ఇవ్వలేదు. ఈ క్రమంలో సూర్యచంద్రరావు మరొక వ్యాపారికి సరుకు సరఫరా చేస్తున్నారని తెలుసుకున్న బషీర్, ఐదుగురు మనుషులతో కలిసి గుంటూరులో లారీని అడ్డుకొని డ్రైవర్‌ను, సూర్యచంద్రరావు కుమారుడినీ కిడ్నాప్ చేశారు.

కిడ్నాప్ సమాచారం సెల్ ఫోన్ మెసేజ్ ద్వారా తండ్రికి తెలియడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన నూజివీడు పోలీసులు పెద్దకాకాని పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గోడౌన్‌పై దాడి చేసి, కిడ్నాప్ అయిన యువకుడిని, లారీనీ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బషీర్ అక్కడ లేకపోవడంతో అతనిపై కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు.

బషీర్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై ప్రస్తుతం ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com