హైదరాబాద్ 30°C
అమరావతి 31°C
IST 2:11 PM
శనివారం అక్టోబర్ 31 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

బత్త తెలుగు రివ్యూ: విజయ్ సేతుపతి నటించిన అద్భుతమైన ఫీల్-గుడ్ మూవీ Netflix లో స్ట్రీమింగ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బత్త తెలుగు రివ్యూ: విజయ్ సేతుపతి నటించిన అద్భుతమైన ఫీల్-గుడ్ మూవీ Netflix లో స్ట్రీమింగ్
📷 Kaustav Das / Pexels
షేర్ కాపీ అయింది ✓

కొన్ని సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చి సంచలనం సృష్టిస్తుంటాయి. అలాంటి ఓ సినిమానే బత్త. విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ లో బాలాజీ ధరణీధర్ డైరెక్షన్ లో తయారైన ఈ తమిళ సినిమా ఈ నెల ఒకటిన థియేటర్లలో రిలీజ్ అయి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు Netflix లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

కొన్ని సినిమాలు కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకి నచ్చుతాయి. బత్త రెండో కేటగిరీలోకి వస్తుంది. చూస్తున్నంతసేపు ఎంతో సరదాగా అనిపించే ఈ మూవీ పూర్తయిన తర్వాత మనసుకు హాయినిస్తుంది. చిత్రం అందులోని పాత్రలు మనతో పాటు ఇంటికి వచ్చేస్తాయి. చాలాసేపు ఆలోచించేలా చేస్తాయి. అసలు మనలో చాలా మంది ఏమేమి మిస్ అవుతున్నాం అనే విషయాలను గుర్తు చేస్తాయి.

ఇందులో శబరి పాత్రకు అమాయకత్వం, పక్కవాళ్ళకు సాయం చేయాలనే మంచితనం, నిజం చెప్పడానికి తర్జనభర్జన పడటం లాంటి లక్షణాలు ఉంటాయి. పాత కాలం పిల్లల అమాయకత్వాన్ని గుర్తుచేసే ఈ పాత్ర కథకి టర్నింగ్ పాయింట్స్ గా నిలుస్తుంది.

ఈ సినిమా కథ గురించి ఎక్కువగా చెప్పడం స్పాయిలర్ అవుతుందని డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు. కానీ ఒక మంచి ఫీల్-గుడ్ మూవీ చూడాలనుకుంటే బత్తను మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. యాక్షన్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఈ తరహా సినిమాలు చూస్తేనే జీవితం అంటే ఏంటో, రోజువారి బిజీలో పడి మనం ఏం కోల్పోతున్నాం అనే విషయాలు అర్థమవుతాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com