హైదరాబాద్ 30°C
అమరావతి 31°C
IST 2:56 PM
శనివారం అక్టోబర్ 31 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సాంకేతిక

చరిత్రలో అతిపెద్ద హ్యాక్: క్రిప్టో దిగ్గజం Binance నుండి 53 వేల కోట్ల రూపాయల చోరీ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
చరిత్రలో అతిపెద్ద హ్యాక్: క్రిప్టో దిగ్గజం Binance నుండి 53 వేల కోట్ల రూపాయల చోరీ
📷 Daniil Komov / Pexels
షేర్ కాపీ అయింది ✓

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అయిన Binance పై సైబర్ దాడి భారీ కలకలం సృష్టించింది. ఈ హ్యాకింగ్ లో 53 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీ చోరికి గురైంది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 10 వేర్వేరు బ్లాక్ చైన్ల నుండి ఈ నిధులను హ్యాకర్లు దారి మళ్ళించారు.

ఈ దాడి జరగగానే వెంటనే స్పందించిన బ్లాక్ చైన్ కంపెనీలు దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను స్తంభింపజేశాయి. దీంతో పెద్ద మొత్తంలో నష్టం తప్పించుకోగలిగారు. అయినప్పటికీ ఇప్పటివరకు క్రిప్టో కరెన్సీ చోరి చరిత్రలో ఇదే అతిపెద్ద దోపిడిగా నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ దాడి వెనుక ఉత్తర కొరియాకు చెందిన ట్రేడర్ టైటర్ హ్యాకర్ గ్రూప్ హస్తం ఉందని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రూప్ గతంలో కూడా పలు సైబర్ దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారుల నిధులను వారికి తిరిగి అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు సంబంధిత కంపెనీలు తెలిపాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com