పెట్రోల్ ధరల పెంపుపై నిరసనగా బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనగా యాదగిరి గుట్ట నుండి మూటకొండూరు వరకు ఈ యాత్ర జరిగింది.
మూటకొండూరులో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతాయని, పేదలకే ఈ భారం పడుతుందని బీర్ల పేర్కొన్నారు. గత 10 రోజులుగా తాను పెట్రోల్, డీజిల్ వాహనాలు వాడట్లేదని, ఒక నెల పాటు సైకిల్ మరియు EV వాహనాలు మాత్రమే వాడతానని ఆయన ప్రకటించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com