హైదరాబాద్ 23°C
అమరావతి 31°C
IST 8:40 PM
మంగళవారం ఆగస్టు 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో SIR ప్రక్రియ ముగింపు; 8.63 లక్షల ఓటర్ల వివరాలు డిజిటలైజ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో SIR ప్రక్రియ ముగింపు; 8.63 లక్షల ఓటర్ల వివరాలు డిజిటలైజ్
📷 A S M Atiqur Rahman / Pexels
షేర్ కాపీ అయింది ✓

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పూర్తయినట్లు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగప్రసాద్ తెలిపారు. ఐదు నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాలు, 104 పోలింగ్ బూత్ల్లో మొత్తం 9,96,198 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారమ్స్ అందించగా 8,63,413 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేసినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ 86.67% పూర్తయిందని, ఇంకా 1,32,785 మంది (13.37%) ఓటర్ల వివరాలు నమోదు కావాల్సి ఉందన్నారు. వీరిలో 31,187 మంది మృతి చెందినవారు, 78,253 మంది శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లినవారు, 14,305 మంది డబుల్ ఓటర్లు, 8,733 మంది ఆబ్సెంట్ ఓటర్లు, మరో 307 మంది ఇతరులుగా గుర్తించినట్లు తెలిపారు.

పాల్వంచ మండలంలో 78,133 మంది ఓటర్ల వివరాలు 85.95% నమోదయ్యాయి. మిగతా వివరాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురిస్తామని రంగప్రసాద్ తెలిపారు. 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ వరకు అబ్జెక్షన్ పీరియడ్ ఉంటుందని, ఓటర్లు తమ వివరాలు ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే సంబంధిత విఆర్ఓ లేదా బీఎల్ఓకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com