హైదరాబాద్ 27°C
అమరావతి 30°C
IST 3:14 AM
ఆదివారం జూలై 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో బైండ్ ఓవర్ నిబంధన ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు లక్ష రూపాయల జరిమానా

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భీమవరంలో బైండ్ ఓవర్ నిబంధన ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు లక్ష రూపాయల జరిమానా
📷 Sora Shimazaki / Pexels
షేర్ కాపీ అయింది ✓

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బైండ్ ఓవర్ నిబంధన ఉల్లంఘించిన ఒక రౌడీ షీటర్‌కు లక్ష రూపాయల జరిమానా విధించారు. జిల్లాలో ఇలాంటి జరిమానా విధించడం ఇదే తొలిసారి.

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ గా ఉన్న స్వర్ణ రావు అనే వ్యక్తి 2016లో హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆదేశాలతో పోలీసులు రౌడీ షీటర్లను స్టేషన్ కు పిలిచి మంచి ప్రవర్తనతో ఉండాలని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత నెల 26వ తేదీన స్వర్ణ రావు రాత్రి ఇంటికి వెళుతుండగా మరొకరి బైక్ ఢీకొనడంతో ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు. బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతనిపై లక్ష రూపాయల జరిమానా విధించినట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాల విషయంలో ఉపేక్షించబోమని హెచ్చరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com