భూభారతీ పోర్టల్‌కు కొత్త సాఫ్ట్‌వేర్ తీసుకొస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ధరణి పోర్టల్ స్థానంలో భూభారతీ పోర్టల్‌ను ప్రారంభించింది. అయితే ఇది ఇప్పటికీ దరణి పాత కోడింగ్‌పైనే నడుస్తోంది.
ఈ కారణంగా తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఇటీవల పోర్టల్‌ను హ్యాక్ చేసి కొన్ని భూముల వివరాలు మార్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికల ఆధారంగా పాత వ్యవస్థను పూర్తిగా తొలగించి సరికొత్త సాఫ్ట్‌వేర్ రూపొందించాలని నిర్ణయించారు.
రెవెన్యూ శాఖ రాబోయే 2-3 నెలల్లో సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో పూర్తి స్థాయి కొత్త పోర్టల్ అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. రైతులకు, భూ యజమానులకు పారదర్శకమైన, సురక్షితమైన డిజిటల్ భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థను అందించడం లక్ష్యంగా ప్రభుత్వం దీనిని చేపట్టింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com