జాతీయం

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల: 11 మంది పేర్లు ప్రకటించిన కేంద్ర నాయకత్వం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల: 11 మంది పేర్లు ప్రకటించిన కేంద్ర నాయకత్వం
📷 CP Khanal / Pexels
షేర్ కాపీ అయింది ✓

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర నాయకత్వం రాజ్యసభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించారు.

గుజరాత్ నుంచి రాజ్బాయి శుక్ల, ముకేష్ భాయ రత్వ, మాన్సింగ్ జితేంద్రలను ఎంపిక చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తాయి తాగాక్, మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ పేర్లను ఖరారు చేశారు.

మణిపూర్ నుంచి శారదా దేవి, రాజస్థాన్ నుంచి అల్కా గుర్జార్, సతీష్ పూనియా, ఒడిస్సా నుంచి దేబాసిష్ సమంతా రేలను కూడా బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com