హైదరాబాద్‌లో బోనాల వేడుకలు ప్రారంభం
హైదరాబాద్‌లో అతిపెద్ద జానపద పండుగ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు భక్తులు. తెలంగాణ గవర్నర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
చోటా బజార్ నుంచి గోల్కొండ కోటకు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరిగింది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో రోజంతా భక్తి వాతావరణం నెలకొంది. లంగర్‌హౌస్‌లో బోనాల జాతర మ్యాగజైన్‌ను మంత్రి పొన్నం ప్రారంభించారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, బోనాల పండుగ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించామని చెప్పారు. వేడుకలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నెలరోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ ఆలయాల్లో నిర్వహిస్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com