BRS నేత చింతలపాటి మధు హత్య: పాత కక్షలే కారణమని SP నరసింహ వెల్లడి
సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం, ఎల్కారం గ్రామానికి చెందిన BRS నేత చింతలపాటి మధు (వయసు దాదాపు 42 సంవత్సరాలు) హత్యకు గురయ్యారు. ఆయన భార్య గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.
మధు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి నుండి టౌన్‌కి బయలుదేరారు. తిరిగి రాకపోవడంతో రాత్రి 2 గంటలకు సూర్యాపేట పోలీసులకు missing case ఇవ్వడం జరిగింది. పోలీసులు సెర్చ్ చేస్తుండగా సూర్యాపేట నుండి జనగాం వెళ్ళే దారిలో ఒక కల్వర్ట్ కింద మూటలో అనుమానాస్పద శవం కనిపించింది. బంధువులు ఆ శవాన్ని మధుగా గుర్తించారు. దాంతో missing case ని murder case గా మార్చారు.
సూర్యాపేట SP నరసింహ మాట్లాడుతూ పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. 2007లో, 2020లో జరిగిన murder cases తో ఈ కేసుకు సంబంధం ఉన్న అవకాశం ఉందని తెలిపారు. నమ్మకస్తుల ప్రోద్బలంతో ఈ హత్య జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని SP చెప్పారు.
టవర్ డేటా analysis తదితర ఆధారాల ఆధారంగా నేరస్తులను గుర్తించే పని జరుగుతోందని SP నరసింహ తెలిపారు. నేరస్తులపై PD Act వేయడంతో పాటు fast track court లో విచారణ చేపట్టేందుకు కృషి చేస్తామని ఆయన వివరించారు. గ్రామ యువకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, పోలీసులకు సహకరించాలని SP అభ్యర్థించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com