సూర్యాపేట జిల్లాలో BRS నేత హత్య — పాత కక్షలు కారణమని పోలీసుల అనుమానం
సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామానికి చెందిన BRS నేత చింతలపాటి మధు హత్యకు గురయ్యారు. మధు మాజీ సర్పంచ్ భర్త, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరుడిగా తెలుస్తోంది.
నిన్న రాత్రి కొంతమంది మధుని మాట్లాడుకుందామని తీసుకెళ్లారు. తర్వాత అతన్ని గొడ్డలి, వడ్డకొడవళ్లతో చంపి, మృతదేహాన్ని ముక్కలు చేసి గోనె సంచిలో మూటకట్టి ఎర్కారం స్టేజి వద్ద పడేశారు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మధుకు నేర చరిత్ర ఉందని, గతంలో రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడని తెలుస్తోంది. ఆ కేసుల నిందితులే ఈ హత్య చేశారని మధు భార్య ఆరోపిస్తున్నారు. ఆ సంబంధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ హత్యను ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com