జాతీయం

నాలుగున్నర గంటల కేంద్ర మంత్రిమండలి సమావేశంలో కీలక చర్చలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నాలుగున్నర గంటల కేంద్ర మంత్రిమండలి సమావేశంలో కీలక చర్చలు
📷 Ryan Thomas / Pexels
షేర్ కాపీ అయింది ✓

కేంద్ర మంత్రిమండలి సమావేశం నాలుగున్నర గంటలు జరిగింది. దేశ అభివృద్ధి, పరిపాలన సంస్కరణలు, Viksit Bharat లక్ష్యాలపై విస్తృతంగా చర్చించారు.

Viksit Bharat నిర్మాణాన్ని 2047 target గా నిర్దేశించారు PM నరేంద్ర మోదీ. ఇది కేవలం slogan కాదు, చిత్తశుద్ధితో నెరవేర్చాల్సిన లక్ష్యమని మంత్రులకు స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల దేశంలో ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి దృష్టి పెట్టింది. ఇంధనం, ఎరువులు, వ్యవసాయం, విమానయాన రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని PM మోదీ ఆదేశించారు.

వ్యవసాయం, అటవి, కార్మిక, రహదారి రవాణా, కార్పొరేట్ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, విద్యుత్ సహా పలు మంత్రిత్వ శాఖలు ప్రెజెంటేషన్లు ఇచ్చాయి. దేశ ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు, ఎగుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నివేదికలు సమర్పించాయి.

పెండింగ్ లో ఉన్న project పనులను వేగంగా పూర్తి చేయాలని, పాలనలో పారదర్శకత తీసుకురావాలని PM మోదీ ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని సూచించారు.

PM మోదీ చేసిన ఐదు దేశాల పర్యటనపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఆ పర్యటనలో సాధించిన ఫలితాలను విదేశాంగ మంత్రి జయశంకర్ వివరించారు. సౌత్ కొరియాలో ఉన్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జెనీవాలో ఉన్న మంత్రి JP నడ్డా సమావేశానికి హాజరు కాలేదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com