UPI లావాదేవీలపై చార్జీలు లేవని కేంద్రం స్పష్టత: వ్యక్తిగత చెల్లింపులు ఉచితం
UPI వ్యక్తిగత చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే వంటి UPI యాప్‌ల ద్వారా వ్యక్తిగతంగా డబ్బు పంపినా, బ్యాంకు బదిలీ చేసినా ఛార్జీలు ఉండవు.
ఇటీవల లోక్‌సభలో డిజిటల్ లావాదేవీలపై MDR (వర్తకుల డిస్కౌంట్ రేటు) ఛార్జ్ విధించేందుకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశం కల్పించే సవరణ బిల్లు ఆమోదించబడింది. దీనితో ప్రతి UPI లావాదేవీపై ఛార్జీలు పడతాయనే ఆందోళనలు వచ్చాయి.
అయితే, కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఆందోళనలు నివృత్తి చేస్తూ, వ్యాపార లావాదేవీలు సైతం అత్యధిక శాతం ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై MDR విధించే ఛార్జీ డెబిట్, క్రెడిట్ కార్డు MDR కంటే తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో సాధారణ UPI వాడకందారులపై ప్రభావం ఉండదని వెల్లడించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com