ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టాలు పరిశీలించిన చంద్రబాబు
AP CM చంద్రబాబు నాయుడు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని సందర్శించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం కార్యక్రమం నుంచి తిరుగుతూ ప్రకాశం బ్యారేజీపై కారును ఆపి నీటి మట్టాలను పరిశీలించారు. పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణ నదికి చేరడంతో బ్యారేజీ నిండుగా ఉందని చెప్పారు. నీటి లభ్యత, డెల్టా కాలువలకు సాగునీటి విడుదల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com