సీఎం చంద్రబాబు నేడు కాకినాడ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలోనే ఉండి ప్రజలతో మమేకమవుతారు.
సాధారణంగా అధికారిక సమావేశాలకే పరిమితమయ్యే ముఖ్యమంత్రి పర్యటన ఈసారి భిన్నంగా ఉంటుంది. ఉండవల్లి నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి 10:50 కి చామవరం హెలిపాడ్ చేరుకుంటారు. 11 నుంచి 12:40 వరకు గ్రామ శివారులోని ప్రజావేదిక వద్ద ప్రజల సమస్యలు, అర్జీలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:40 వరకు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం 2:40 నుంచి 4:10 వరకు పార్టీ కేడర్‌తో సమావేశమై భవిష్యత్ కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారు.
ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజావేదిక, పార్టీ సమావేశాలకు అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. గ్రామంలో దృష్టి లోపం ఉన్న కార్మికుడు పోలవరం సింహాచలం ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి.
గోదావరి జలాల వినియోగంపై కూడా సీఎం సమీక్షించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం హెలికాప్టర్‌లో ఉండవల్లి తిరిగి వెళ్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com