36 సాగునీటి ప్రాజెక్టులను రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 సాగునీటి ప్రాజెక్టులను రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో జల వనరుల శాఖపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎత్తిపోతల పథకాల మరమత్తులు, వాటి నిర్వహణపై చర్చ జరిగింది. ఇరిగేషన్ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
ఎత్తిపోతల ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను జలహారతి కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని అధికారులు సూచించారు. విద్యుత్ రంగంలోని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరహాలో వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలనే అంశాన్ని పరిశీలించాలని CM ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం ఉంది. ఈ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, తనకు అప్డేట్ ఇవ్వాలని CM చెప్పారు. 36 ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి అధికారులు ఒక కటాఫ్ డేట్‌ను CMకు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com