హైదరాబాద్ 25°C
అమరావతి 32°C
IST 6:26 PM
మంగళవారం జూలై 28 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

అమరావతి క్వాంటం వ్యాలీలో దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ చికిత్స ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అమరావతి క్వాంటం వ్యాలీలో దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ చికిత్స ప్రారంభం
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

అమరావతి క్వాంటం వ్యాలీలో భారతదేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ చికిత్స విధానాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రాజెనెకా ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం పై సంతకాలు జరిగాయి.

రిలయన్స్ కు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూఆర్ఏఐ (QRAI) సంస్థలతో కలిసి ఆస్ట్రాజెనెకా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఈ సెంటర్ ద్వారా ఊపిరితీతులు, రొమ్ము క్యాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్ చేస్తారు. కృత్రిమ మేధ (AI), నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ సాయంతో క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించి, రోగి శరీర తత్వానికి అనుగుణంగా వ్యక్తిగత చికిత్స అందిస్తారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ఎక్స్‌రే స్క్రీనింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య సౌకర్యాలు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్ ను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నామని తెలిపారు. వైద్యరంగంలో ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానం అవసరమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆస్ట్రాజెనెకా ఇండియా ఎండి డా. ఏ. ప్రవీణ్ రావు, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూఆర్ఏఐ ప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com