స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్‌ను నీతి ఆయోగ్‌లో ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్‌ను ఆయన సమావేశంలో సమర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారదర్శక విధానాలతో రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించిందని తెలిపారు. పేదరిక నిర్మూలన, భారీ స్థాయిలో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి లక్ష్యాలను స్వర్ణాంధ్ర రోడ్‌మ్యాప్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకువస్తామని చంద్రబాబు ప్రకటించారు. విద్యార్థుల కోసం క్వాంటం టెక్నాలజీస్‌లో అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్స్ కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు రేపు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. దామినేనాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. హోం మంత్రి అనిత జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com