పెట్టుబడులు, అమరావతి ప్రాజెక్టుల కోసం సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల సింగపూర్ పర్యటన ప్రారంభించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులను ముందుకు నడపడం ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.
మొదటి రోజు ఆయన భారత హై కమిషనర్ శిల్పా కాంబులేతో సమావేశమై, స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్ట్లతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్‌బాచ్‌తో విందు సమావేశం, సింగపూర్ సీనియర్ మంత్రి లోయన్ లింగ్‌తో భేటీ కూడా షెడ్యూల్ చేశారు. గగు క్లౌడ్, జీఐసీ, వైసీహెచ్ లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులతో విడివిడిగా చర్చిస్తారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోంమంత్రి కే షణ్ముగం, మానవ వనరుల మంత్రి టాన్ సీ లింగ్‌తో సమావేశం కానున్నారు.
రెండో రోజు, 16వ తేదీన, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సీబీఎన్ నెట్ 361 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏపీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్‌లో పాల్గొని, అమరావతి ప్లానింగ్ సమావేశంలో సోర్బానా జురాంగ్‌తో చర్చిస్తారు. సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో భేటీ అవుతారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో ప్రసంగించి, ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. చివరగా సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్‌షోలో పాల్గొంటారు.
సీఎం వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈడీబీ సీఈఓ షణ్మోహన్, సీఆర్‌డీఏ అధికారుల బృందం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com