హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 9:09 AM
ఆదివారం ఆగస్టు 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

బహిరంగ నిరసనలపై హెచ్చరించిన సీఎం చంద్రబాబు; నెలాఖరుకు రెండు ప్రాజెక్టుల ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బహిరంగ నిరసనలపై హెచ్చరించిన సీఎం చంద్రబాబు; నెలాఖరుకు రెండు ప్రాజెక్టుల ప్రారంభం
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభిస్తామని ప్రకటించారు. మెలిగొండ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్ట్ కూడా ఇందులో భాగమని చెప్పారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బస్టాండ్లు, రహదారుల వెంట నిరసనలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

గొడ్డలిపార్టీ నిరసనల్లో రౌడీలు, గంజా బ్యాచులు తప్ప డీఎస్సీ అభ్యర్థులు ఎవరైనా ఉంటున్నారా అని ప్రశ్నించారు. ఇటీవల కొన్ని సంఘాలు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు యూనింట్ ఇన్ఛార్జిల శిక్షణ తరగతుల్లో పాల్గొని, ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జిలు, మండల అధ్యక్షులకు గౌరవం దక్కేలా చూస్తామని భరోసా ఇచ్చారు. పలువురు సామాన్యుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com