జాతీయం

భక్తులకు గుడ్ న్యూస్: చెర్లపల్లి-తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భక్తులకు గుడ్ న్యూస్: చెర్లపల్లి-తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది
📷 Ryan Thomas / Pexels
షేర్ కాపీ అయింది ✓

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చెర్లపల్లి-తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది.

చెర్లపల్లి నుంచి 17059 నంబర్‌తో, తిరుచానూరు నుంచి 17060 నంబర్‌తో ఈ రైలు నడవనుంది. చెర్లపల్లి నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9:30కి బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం 12:30కి తిరుచానూరు చేరుకుంటుంది.

తిరుచానూరు నుంచి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి, మంగళవారం ఉదయం 8 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల భక్తులకు ఈ రైలు వీలుగా ఉంటుందని భావిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com