యాదాద్రిలో ₹100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి గుట్టపై ₹100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ₹43 కోట్లతో 15 ఎకరాల్లో వేద పాఠశాల నిర్మిస్తారు. కొండపైన కళ్యాణ మండపం, దీక్షాపరుల సదనం, మెట్ల మార్గంపై పైకప్పు కూడా నిర్మిస్తారు. వాయువ్య దిశ వైపు నుంచి ప్రధాన ఆలయ ప్రాంగణానికి ప్రత్యేక మెట్ల మార్గం కూడా కొత్తగా వస్తుంది.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన రేవంత్ రెడ్డికి అధికారులు, ఆలయ పూజారులు స్వాగతం పలికారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి సీఎం భూమి పూజ చేశారు. Temple City లో ఒకే చోట ఐదు శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com