యాదగిరిగుట్టలో ₹100 కోట్లతో ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో ₹100 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
టెంపుల్ సిటీ పరిధిలో 15 ఎకరాల స్థలంలో ₹43.80 కోట్లతో వేద పాఠశాల నిర్మించాలని నిర్ణయించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో వేద పాఠశాలకు శంకుస్థాపన జరిగింది.
భక్తులు మెట్ల మార్గం ద్వారా వెళ్లేటప్పుడు ఎండ నుండి రక్షణ కోసం shelter నిర్మించాలని కూడా నిర్ణయించారు. వివాహ మండపం సహా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈరోజు శంకుస్థాపన జరిగింది.
కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com