హైదరాబాద్ 25°C
అమరావతి 26°C
IST 10:32 PM
ఆదివారం సెప్టెంబర్ 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సైబర్ మోసాలు — పంజాబ్ పోలీసుల హెచ్చరిక

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సైబర్ మోసాలు — పంజాబ్ పోలీసుల హెచ్చరిక
📷 khezez | خزاز / Pexels
షేర్ కాపీ అయింది ✓

కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. యువతలో ఈ digital పార్టీకి ఉన్న ఆసక్తిని అడ్డుపెట్టుకుని వల విసురుతున్నారు.

నేరగాళ్ళు అసలైన website ను పోలిన fake లింక్ తయారు చేశారు. Digital membership పేరుతో WhatsApp, Telegram వేదికలుగా ఆకర్షణీయమైన సందేశాలు పంపుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేయగానే మొబైల్ ఫోన్ hack అవుతుందని పోలీసులు హెచ్చరించారు.

ఫోన్‌కు వచ్చే bank OTP లను బాధితులకు తెలియకుండా auto-forward చేసే software ఉపయోగిస్తున్నారని పంజాబ్‌లోని లుయానా పోలీసులు తెలిపారు. ఈ మోసం ద్వారా బ్యాంకు ఖాతాల్లోని సొమ్మంతా స్వాహా అవుతోందని వారు పేర్కొన్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇలాంటి fake లింకులు వదులుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

WhatsApp, Telegram లో వచ్చే అనుమానస్పద లింకులు తెరవకూడదని పోలీసులు సూచించారు. వ్యక్తిగత వివరాలు, banking సమాచారం ఎవరికీ చెప్పవద్దని విజ్ఞప్తి చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com