బెడ్ విధానంలో పత్తి సాగు: 30-40% అధిక దిగుబడి సాధ్యమని శాస్త్రవేత్తలు
ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ బెడ్ విధానంలో పత్తి సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ పద్ధతిలో సాగు చేస్తే 30 నుంచి 40 శాతం అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగవుతోంది. ఖరీఫ్ సీజన్‌లో 80 శాతం పైగా వర్షాధారంగా సాగు జరుగుతుంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఎకరానికి 5-6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే పొందుతున్నారు. అధిక వర్షాలు పడినప్పుడు నల్లరేగడి భూముల్లో నీరు నిలిచి జూలై-ఆగస్టు నెలల్లో పంట పెరుగుదల దెబ్బతింటోంది.
బెడ్ విధానంలో bed maker యంత్రం ద్వారా ఒక ఎకరాన్ని 40 నిమిషాల నుంచి ఒక గంట లోపు సిద్ధం చేయవచ్చు. బెడ్ ఎత్తు 30-40 cm ఉంటుంది. వరుసల మధ్య దూరం 3, 4 లేదా 5 అడుగులు పెట్టుకోవచ్చు.
ఈ విధానంలో అధిక వర్షాలు పడినప్పుడు నీరు చానళ్ల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. వేర్లకు గాలి ప్రసరణ బాగా ఉంటుంది. వర్షాలు తగ్గినప్పుడు భూమిలో తేమ నిల్వ ఉండి పంట దెబ్బతినదు. చీడపీడల ఉధృతి తగ్గుతుంది. సెప్టెంబర్-అక్టోబర్‌లో కాయ దశలో కింది కాయలు కుల్లిపోవడం నివారించవచ్చు. అంతర్ కృషి చేయలేని పరిస్థితిలో యంత్రాల ద్వారా కలుపు నిర్మూలన సాధ్యమవుతుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com