ఢిల్లీలో రవాణా సమ్మె: కూరగాయల ధరలు రెండు మూడు రెట్లు పెరిగాయి
ఢిల్లీలో వాణిజ్య వాహన యూనియన్లు మూడు రోజుల సమ్మె పిలిచాయి. దీని వల్ల మార్కెట్లో కూరగాయల సరఫరా తగ్గిపోయింది. హోల్సేల్ మార్కెట్లలో ధరలు రెండు మూడు రెట్లు పెరిగాయి.
ప్రస్తుతం కేజీ అల్లం ₹130కు, కొత్తిమీర కేజీ ₹100కు చేరింది. ఆజాద్పూర్ మండీతో సహా ఢిల్లీలోని పెద్ద మార్కెట్లన్నీ ప్రభావితమయ్యాయి. మార్కెట్ వ్యాపారులు ఒకటి రెండు రోజులకు మాత్రమే నిలువలు ఉన్నాయని చెప్తున్నారు.
టాక్సీ, ఆటో చార్జీలు పెంచాలని, కమర్షియల్ వాహనాలపై పర్యావరణ సెస్‌ను పునఃసమీక్షించాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతోంది. All India Motor Transport Union తో సహా 68కు పైగా ట్రాన్స్పోర్ట్ యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి.
టాక్సీ, ఆటో సర్వీసులు నిలిచిపోవడంతో ఢిల్లీ ప్రజలు బస్సులు, మెట్రో, లోకల్ ట్రైన్లపై ఆధారపడుతున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోయాయి.
15 ఏళ్లుగా టాక్సీ చార్జీలు పెరగలేదని, కానీ డీజిల్, CNG ధరలు నిరంతరం పెరుగుతున్నాయని వాహన యజమానులు చెప్తున్నారు. వాహన insurance, fitness certificate, permit చార్జీలు కూడా పెరిగాయని వారు పేర్కొన్నారు. Uber, Ola, Rapido వంటి app ఆధారిత కంపెనీలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com