అంతర్జాతీయం

డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో వ్యాపారాలతో బిలియన్ డాలర్ల ఆదాయం : యూఎస్ గవర్నమెంట్ ఎథిక్స్ నివేదిక

రచన: ఉషా కిరణం డెస్క్ ·
డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో వ్యాపారాలతో బిలియన్ డాలర్ల ఆదాయం : యూఎస్ గవర్నమెంట్ ఎథిక్స్ నివేదిక
📷 Shealeah Craighead / Wikimedia Commons / public-domain
షేర్ కాపీ అయింది ✓

US అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2025లో క్రిప్టో కరెన్సీల ద్వారా బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించారు. US ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

900 పేజీలకు పైగా ఉన్న ఈ నివేదిక ప్రకారం ట్రంప్ కుటుంబం 2024లో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ (WLF) అనే క్రిప్టో ప్లాట్ఫాం ప్రారంభించింది. WLF జారీ చేసిన టోకెన్ల తొలి విక్రయం ద్వారా 550 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం లభించింది. DT Marks DEFI అనుబంధ సంస్థ నుండి ట్రంప్ మరియు ఆయన ముగ్గురు కుమారులు అదనంగా 22.5 బిలియన్ WLF టోకెన్లను సొంతం చేసుకున్నారు.

2025 ఏప్రిల్లో WLF సంస్థ అమెరికా డాలర్ విలువతో ముడిపడిన స్టేబుల్ కాయిన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్ తన పేరుతో ఒక క్రిప్టో కరెన్సీని ప్రారంభించి, లైసెన్సింగ్ ఒప్పందం ద్వారా 635 మిలియన్ డాలర్ల రాయల్టీలను అందుకున్నారు.

ఫోర్బ్స్ మ్యాగజైన్ లెక్కల ప్రకారం 2024 నుంచి 2026 మధ్య కాలంలో ట్రంప్ సంపద 2.3 బిలియన్ డాలర్ల నుండి 6.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాయిన్‌బేస్ వంటి క్రిప్టో ఎక్స్ఛేంజ్ కంపెనీల్లోని షేర్ల ద్వారా కూడా ఆయన మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందినట్లు నివేదిక తెలియజేసింది.

ట్రంప్ ప్రస్తుత లావాదేవీల నిర్వహణ కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ ఆధీనంలో ఉంది. అధ్యక్ష పదవి ముగిసిన తర్వాత ఈ ట్రస్ట్ ను రద్దు చేసుకుని ఆస్తుల నియంత్రణ తాను చేపట్టేలా నిబంధనలు ఉన్నట్లు సమాచారం.

గతంలో బిట్‌కాయిన్ ను తీవ్రంగా విమర్శించిన ట్రంప్, ప్రస్తుతం క్రిప్టో రంగానికి మద్దతు తెలుపుతూ, వ్యక్తిగతంగా లాభపడుతున్న విషయం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com