ఇయర్‌బడ్స్ ఎక్కువగా వాడితే వినికిడి తగ్గుతుందా? వైద్యుల హెచ్చరిక
బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ను నిరంతరం వాడటం వల్ల వినికిడి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెవిలో ఇన్ఫెక్షన్లు, టినైటస్ వంటి సమస్యలు కూడా రావచ్చని అంటున్నారు.
ఇయర్‌బడ్స్‌ను ఎక్కువ సేపు పెట్టుకోవడం వల్ల చెవిలోని ఇయర్ వాక్స్ లోపలికి నెట్టబడి వినికిడి శక్తి తగ్గుతుంది. అలాగే, చెవి మూసుకుపోయి గాలి ప్రసరణ లేకపోవడంతో బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎక్కువ శబ్దంతో వినడం వల్ల టినైటస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చిన వారికి ఏ శబ్దం లేకపోయినా చెవిలో ఏదో ఒక సౌండ్ రిపీట్ అవుతూ వినిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు చెప్తున్నారు.
ఈ సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో కొన్ని సూచనలు: 60/60 నియమం పాటించాలంటున్నారు. అంటే ధ్వనిని 60 శాతం కంటే ఎక్కువ పెట్టకుండా, 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇయర్‌బడ్స్ వాడకూడదు. రోజూ ఇయర్‌బడ్స్‌ను దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇతరుల ఇయర్‌బడ్స్ వాడటం తగ్గించాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు ఇయర్‌బడ్స్ పెట్టుకోకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com