హైదరాబాద్ 32°C
అమరావతి 35°C
IST 5:09 PM
మంగళవారం జూలై 14 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఓటరు జాబితా సవరణ గడువును పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏపీలో ఓటరు జాబితా సవరణ గడువును పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం
📷 Akhil Dasari / Pexels
షేర్ కాపీ అయింది ✓

కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును పొడిగించింది. కొత్త గడువు జూన్ 24 వరకు ఉంటుంది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. పలు ప్రాంతాల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం, డిజిటలైజేషన్‌లో అవాంతరాలు ఎదురవడం వల్ల EC గడువు పొడిగించింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలవుతుంది. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు ఆ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com