తెలంగాణ

వికారాబాద్‌లో నెలలు నిండని శిశువుకు CPR చేసి ప్రాణాలు నిలిపిన EMT

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వికారాబాద్‌లో నెలలు నిండని శిశువుకు CPR చేసి ప్రాణాలు నిలిపిన EMT
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

వికారాబాద్ జిల్లా తుంకిమిట్ల గ్రామానికి చెందిన భువనేశ్వరి, నవీన్ దంపతులకు మూడు రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. నెలలు నిండకముందే జన్మించడంతో శిశువుకు గుండె వేగం తక్కువగా, శ్వాసకోస సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది.

మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా శిశువు గుండె వేగం, శ్వాస ఆగిపోయాయి. వెంటనే అంబులెన్స్‌లో ఉన్న EMT శాంతి కుమార్ CPR చేసి శిశువు ప్రాణాలు నిలబెట్టారు.

శిశువు ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. శాంతి కుమార్ సేవలను శిశువు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com