విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైట్‌పేపర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెండేళ్ల ప్రభుత్వ పాలన నేపథ్యంలో విద్యుత్ రంగానికి సంబంధించిన శ్వేతపత్రం (White Paper) విడుదల చేశారు. ప్రభుత్వం అన్ని శాఖలపై గతంలో విడుదల చేసిన శ్వేతపత్రంలో భాగంగా ఈ వైట్ పేపర్ ను పవర్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేకంగా రిలీజ్ చేసిందని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించామని మంత్రి తెలిపారు.
ఈ శ్వేతపత్రంలో గత YSRCP ప్రభుత్వ పనితీరు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను పోల్చి చూపారు. YSRCP హయాంలో పలుమార్లు విద్యుత్ బిల్లులు పెంచడం, బయటి నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వంటి అంశాలు ఈ నివేదికలో ప్రస్తావించారు. అయితే తాము ఆ సమస్యలను క్రమంగా నియంత్రించామని మంత్రి వివరించారు.
మంత్రి వివరాల ప్రకారం, గత సంవత్సరం విద్యుత్ ఛార్జీలను కొంత మేర తగ్గించారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపిస్తున్నామని, రాష్ట్రంలో సూర్య ఘర్ (PM Surya Ghar) పథకం ద్వారా దాదాపు 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కనెక్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయదార్లకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com