హైదరాబాద్ 29°C
అమరావతి 33°C
IST 11:44 AM
గురువారం ఆగస్టు 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

ఇయర్ బడ్స్ ఎక్కువగా వాడితే వినికిడి దెబ్బతినే ప్రమాదం: వైద్యుల హెచ్చరిక

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఇయర్ బడ్స్ ఎక్కువగా వాడితే వినికిడి దెబ్బతినే ప్రమాదం: వైద్యుల హెచ్చరిక
📷 Siobhan Howerton / Pexels
షేర్ కాపీ అయింది ✓

రోజువారీ జీవితంలో ఇయర్ బడ్స్ వాడకం పెరిగిపోయింది. కాల్స్ మాట్లాడటం, పాటలు వినడం, సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం వంటి వాటికి ఎక్కువ మంది ఇయర్ బడ్స్‌నే వాడుతున్నారు. అయితే ఈ అలవాటు వినికిడికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బ్లూటూత్ ద్వారా పనిచేసే ఈ పరికరాలు సిగ్నల్స్ ఉపయోగించడం వల్ల రేడియేషన్ కూడా సమస్యగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు వాడితే చెవి నొప్పి, వినికిడి సమస్యలు రావచ్చని, వీలైనంత వరకు స్పీకర్‌ మోడ్‌లో వినాలని సూచిస్తున్నారు.

వైర్‌ లేని ఇయర్ బడ్స్ కంటే వైర్డ్ హెడ్‌ఫోన్స్ సురక్షితమని, అయినా ఏ పరికరమైనా మితంగానే వాడాలని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. రోజుకు 2 నుంచి 3 గంటల కంటే ఎక్కువ ఇయర్ బడ్స్ వాడొద్దన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com