SRH vs RCB మ్యాచ్: నకిలీ టికెట్ల మోసం గురించి పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంలో జరిగే SRH vs RCB IPL మ్యాచ్ కి ముందు నకిలీ టికెట్ల మోసాలు పెరిగాయి. తెలంగాణ Cyber Security Bureau పోలీసులు అభిమానులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్ళు అధికారిక District app మాదిరిగా ఒక నకిలీ platform తయారు చేశారు. అధికారిక app లో టికెట్లు అన్నీ sold out అయినా, ఈ నకిలీ app లో ₹2,000 నుండి టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నారు. నిజమైన app అనుకొని అభిమానులు చెల్లింపు చేస్తే డబ్బులు కట్ అవుతాయి. కానీ టికెట్ మాత్రం వచ్చే అవకాశం లేదు.
ఇప్పటివరకు 8,000కు పైగా నకిలీ టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. నకిలీ టికెట్లు చూపించినా స్టేడియంలోకి అనుమతి ఇవ్వమని పోలీసులు స్పష్టం చేశారు.
టికెట్ కొన్న అభిమానులు తమ app authorization తప్పనిసరిగా confirm చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కేవలం అధికారిక District app ద్వారా మాత్రమే టికెట్లు కొనాలని హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com