ఆంధ్రప్రదేశ్

అరటి తోటలో నిమ్మ అంతర పంట: పశ్చిమ గోదావరి రైతు విజయగాథ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అరటి తోటలో నిమ్మ అంతర పంట: పశ్చిమ గోదావరి రైతు విజయగాథ
📷 Sandeep Kashyap / Pexels
షేర్ కాపీ అయింది ✓

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం గ్రామానికి చెందిన రైతు నడింపల్లి సత్యనారాయణ రాజు ఒక ఎకరం అరటి తోటలో నిమ్మను అంతర పంటగా సాగు చేస్తున్నారు.

ఆయన ఎకరానికి 450 కర్పూర చక్కరగలి రకం అరటి మొక్కలు నాటారు. ఆరేసి అడుగుల దూరంలో మొక్కలు నాటడం వల్ల మంచి దిగుబడి వస్తోందని తెలిపారు. కర్పూర రకానికి 15 రోజులకోసారి పురుగు మందు పిచికారీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

మొదటి సంవత్సరం పెట్టుబడి కూలీలు, గెడలు, ఎరువులు కలిపి సుమారు ₹80,000 నుండి ₹90,000 అవుతోందని సత్యనారాయణ రాజు తెలిపారు. పంట సక్రమంగా వస్తే ₹1 లక్ష వరకు మిగులుతుందని చెప్పారు. అయితే గాలివానలు, కోతుల వల్ల నష్టం జరిగితే పెట్టుబడి కూడా రాదని ఆయన పేర్కొన్నారు.

అంతర పంటగా 150 నిమ్మ మొక్కలు నాటారు. నిమ్మ తోటకు కూలీలతో సహా సుమారు ₹15,000 ఖర్చు అయినట్లు తెలిపారు. మొక్కలు నాటి రెండేళ్ళు పూర్తవుతున్నాయి. మరో ఆరు నెలల్లో నిమ్మ మొక్కల నుండి దిగుబడి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com