హైదరాబాద్ 27°C
అమరావతి 35°C
IST 2:19 PM
శుక్రవారం జూలై 17 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

తాగిన మైకంలో కుమారుడిని కర్రతో కొట్టి చంపిన తండ్రి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తాగిన మైకంలో కుమారుడిని కర్రతో కొట్టి చంపిన తండ్రి
📷 Vladimir Shipitsin / Pexels
షేర్ కాపీ అయింది ✓

కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొట్లవానిపాలెంలో తాగిన మైకంలో తండ్రి తన కుమారుడిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం, గ్రామానికి చెందిన రామ్మోహన్ రావు, కళ్యాణ చక్రవర్తి తండ్రీ కొడుకులు ఇద్దరికీ మధ్యం అలవాటు ఉంది. రెండు రోజుల క్రితం కళ్యాణ్ తాగి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కళ్యాణ్ మళ్ళీ తాగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఇంతలో రామ్మోహన్ రావు కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి, నిద్రిస్తున్న కుమారుడిపై కర్రతో దాడి చేశాడు. బలమైన దెబ్బలకు తీవ్ర రక్తస్రావమై కళ్యాణ్ అక్కడికక్కడే మరణించాడు.

సమాచారం అందుకున్న మచిలీపట్నం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడి తల్లి మాట్లాడుతూ, ఇద్దరూ సాధారణ స్థితిలో మంచిగా ఉంటారని, మద్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com