హైదరాబాద్ 24°C
అమరావతి 29°C
IST 9:03 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్ట్
📷 Siarhei Nester / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ACB అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఆయన నివాసంతో సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టారు. సోదాల్లో రూ.5.92 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఇందులో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ప్లాట్లు, కమర్షియల్ భవనం ఉన్నాయి. నగదు, కీలక డాక్యుమెంట్లు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్తో పాటు సూర్యాపేటలోని భుజంగరావు బంధువుల ఇళ్లల్లోనూ ACB బృందాలు సోదాలు నిర్వహించాయి. భుజంగరావు సర్వీస్ కాలంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ACB దర్యాప్తు కొనసాగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com