తాడిపత్రిలో యాచకులను దత్తత తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటన
అనంతపురం జిల్లా తాడిపత్రిలో యాచకులను దత్తత తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.
భిక్షాటన చేస్తున్న సుమారు 200 కుటుంబాలతో ఆయన అవగాహన సమావేశం నిర్వహించారు. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
తాడిపత్రిలో భిక్షాటన పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని జేసీ తెలిపారు. పిల్లల్లో కొందరు స్కూల్ డ్రాపవుట్లుగా ఉన్నారని, వారికి నైపుణ్య శిక్షణ అవసరమని చెప్పారు.
ఎవరైనా మరలా భిక్షాటన చేస్తే వారిని తాము దత్తత తీసుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com