హైదరాబాద్ 26°C
అమరావతి 30°C
IST 2:40 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

భూ వివాదం కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణకు హాజరు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భూ వివాదం కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణకు హాజరు
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

శ్రీకాకుళం: భూ వివాదం కేసులో వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, విచారణకు హాజరు కావాలని సూచించింది.

భూ యజమాని బతికి ఉండగా మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, కోట్ల రూపాయల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఆయనతో పాటు భార్య వాణిశ్రీ, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ్మినేని సీతారాం తర్వాత వాణిశ్రీని కూడా పోలీసులు విచారించనున్నారు.

ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా పోలీసులు చేర్చగా, 8 మంది ఇప్పటికే పట్టుబడ్డారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, తమ్మినేని సీతారాం కుమారుడు నాగు కూడా పరారీలో ఉన్నాడు. కేసు విచారణను ఆర్‌ఐ సురేష్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com