జాతీయం

ఫోకస్ లేమికి నాలుగు కారణాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఫోకస్ లేమికి నాలుగు కారణాలు
📷 Sharath G. / Pexels
షేర్ కాపీ అయింది ✓

ప్రస్తుతం చాలా మంది ఏకాగ్రత కోల్పోవడం, పనిపై ఫోకస్ చేయలేకపోవడం వంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి, పనితీరును దెబ్బతీస్తుంది. ఫోకస్ లేమికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి.

నిద్రలేమి: సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడు పూర్తి సామర్థ్యంతో పనిచేయదు. శరీరం అలసిపోయి, ఏ పనిపైనా దృష్టి పెట్టలేదు. దీర్ఘకాలిక నిద్రలేమి ఫోకస్ ను మరింత దెబ్బతీస్తుంది.

మల్టీ టాస్కింగ్: ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నిస్తే మానసిక శక్తి పై భారం పడుతుంది. ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియకుండా గందరగోళం ఏర్పడుతుంది. ఫలితంగా ఫోకస్ కోల్పోయి పనులు ఆలస్యమవుతాయి.

డిస్ట్రాక్షన్లు: ఫోన్ మోగడం, ఇష్టమైన టీవీ షో చూడటం వంటి అవాంతరాలు ఉన్న వాతావరణంలో ఫోకస్ చేయడం కష్టం. నిశ్శబ్దమైన ప్రదేశంలో పనిచేయడం మంచిది.

మానసిక ఆరోగ్యం: అనవసర భయాలు, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఫోకస్ ను దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితిలో మానసిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com