జూబ్లీ హిల్స్‌లో ప్రపంచ సొరియాసిస్ దినం.. రోగుల సందేహాలు తీర్చిన వైద్యులు
హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో ప్రపంచ సొరియాసిస్ దినం కార్యక్రమం నిర్వహించారు. సొరియాసిస్ పీపుల్స్ ఫోరం, అంచన స్కిన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. సొరియాసిస్‌తో బాధపడుతున్న రోగులతో వైద్యులు ముఖాముఖి మాట్లాడారు. వ్యాధిపై రోగులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.
మిగతా వ్యాధులతో పోల్చితే సొరియాసిస్ కూడా ఒక వ్యాధి మాత్రమే అని వైద్యులు చెప్పారు. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని రోగులకు భరోసా ఇచ్చారు. సొరియాసిస్ రోగులకు వైద్యులు అండగా ఉంటారని తెలిపారు.
రోగుల్లో ఉన్న అపోహలను తొలగించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి నయం అవుతుందా, ఇది దీర్ఘకాలిక వ్యాధా, అంటు వ్యాధా, జీవితాంతం ఇలాగే ఉండిపోతుందా అనే సందేహాలు రోగుల్లో ఉంటాయి. పెళ్లిళ్లు చేసుకోవచ్చా, పిల్లలు పుడతారా అనే అపోహలు కూడా ఉంటాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ అపోహలను తొలగించేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com