ఉచిత వర్చువల్ డ్రైవింగ్ వెబ్‌సైట్‌తో ప్రపంచ నగరాల్లో ఒత్తిడి లేని ప్రయాణం
Drive and Listen అనే ఉచిత వెబ్‌సైట్ వినియోగదారులకు ప్రపంచ నగరాల వీధుల్లో వర్చువల్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది. పారిస్, ముంబై, టోక్యో, న్యూయార్క్ తో సహా అనేక నగరాల డ్రైవింగ్ వీడియోలను ఈ సైట్ లో చూడవచ్చు.
ఈ వెబ్‌సైట్ లో నగరాన్ని ఎంచుకుంటే ఆ ప్రాంతానికి చెందిన లైవ్ రేడియో, ట్రాఫిక్ శబ్దాలు, కారు ఇంజన్ సౌండ్, వర్షపు శబ్దం వంటి రియలిస్టిక్ ఆడియో వింటూ ప్రయాణం చేయవచ్చు. కారు వేగాన్ని కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. వాకింగ్, సైక్లింగ్, డ్రోన్ వ్యూ, నైట్ మోడ్ వంటి అదనపు ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అలాగే ఫుడ్ జోన్ లో నగరాల్లో ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ వీడియోలను చూడవచ్చు. స్ట్రెస్ ఫ్రీ మోడ్ లో బీచ్, కొండలు, వర్షం, మంచు ప్రదేశాల వంటి ప్రశాంతమైన దృశ్యాలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో వీక్షించవచ్చు.
ఈ వెబ్‌సైట్ ను ఇస్తాంబుల్ కు చెందిన విద్యార్థి ఎర్కామ శేఖర్ 2020 సంవత్సరంలో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో రూపొందించారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి, ట్రావెలింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని వెబ్‌సైట్ లో పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com