మీసాలతో పుట్టిన పసిబిడ్డ వీడియో ఫేక్: AIతో తయారు చేశారని నిపుణుల విశ్లేషణ
ఈక్వెడార్ నుంచి బయటపడిన ఒక పసిబిడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఆ చిన్నారి ముఖంపై దట్టమైన నల్లటి మీసాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది నిజం కాదని, AIతో సృష్టించిన ఫేక్ అని పరిశోధకులు చెప్తున్నారు.
ఆ వీడియోలో పుట్టిన కొన్ని గంటల పసికందు ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉంది. పై పెదవి మీద, బుగ్గల అంచుల్లో నల్లటి మీసాలు స్పష్టంగా కనిపించాయి. నిమిషాల్లోనే ఈ క్లిప్‌కు లక్షలాది వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాల మీమ్స్, సెటైర్లు చేశారు. మూడు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తిలా ఉన్నాడని కొందరు కామెంట్ చేశారు. ఆర్మీ డ్రెస్, సిగార్‌తో మీమ్స్ కూడా తయారయ్యాయి.
వైద్యశాస్త్రం ప్రకారం పుట్టిన పిల్లలకు ఇలాంటి మీసాలు రావడం సాధ్యం కాదు. పుట్టినప్పుడు పిల్లల శరీరం మీద లానుగో అనే సన్నని లేత వెంట్రుకలు ఉంటాయి. అవి సాధారణంగా వీపు, భుజాలు, చెవుల చుట్టూ కనిపిస్తాయి. కొన్ని రోజుల్లో అవి తమంతట తామే రాలిపోతాయి. కానీ దట్టమైన నల్లటి మీసాలు వైద్యశాస్త్ర చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు.
పరిశోధకులు, సైబర్ నిపుణులు ఆ వీడియోను పరిశీలించారు. బిడ్డ తల కదులుతున్నప్పుడు మీసాల భాగంలో బ్లర్ కనిపించింది. ఆసుపత్రి గదిలోని సహజ కాంతికి మీసాలపై పడుతున్న వెలుతురు సరిపోలలేదు. AI ఫేస్ మ్యాపింగ్ ఫిల్టర్‌తో సాధారణ పసిబిడ్డ ముఖానికి డిజిటల్ మీసాలు అతికించారని వారు తేల్చారు.
ఈ వీడియోను ఏ డాక్టర్ గానీ, ఏ ఆసుపత్రి గానీ ధృవీకరించలేదు. likes, views కోసం సృష్టించిన ఈ ఫేక్ వీడియో ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఆశ్చర్యంలో ముంచింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com