టెన్త్ మార్కులతోనే నేరుగా గవర్నమెంట్ జాబ్: TGSRTC లో 1500 కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో
తెలంగాణలో నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం TGSRTC లో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత RTC లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జరగనుంది.
ఈ నియామకాలు TGSRTC యాజమాన్యమే స్వయంగా చేపడుతుంది. పదవ తరగతిలో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి పరీక్ష ఉండదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కండక్టర్ పోస్టుల భర్తీ జరగలేదు. ప్రతి సంవత్సరం రిటైర్మెంట్లు జరుగుతూ ఉండటంతో ఖాళీలు పెరిగిపోయాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు అన్ని రీజియన్ల డిపోలలో ఈ పోస్టులు ఉంటాయి. రీజియన్ వారిగా ఖాళీలు పంపిణీ అవుతాయి మరియు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. గతంలో పదవ తరగతిలో గ్రేడింగ్ సిస్టం ఉండేది, ప్రస్తుతం మార్కుల శాతం సిస్టం అమలులో ఉంది. కొందరి దగ్గర మార్కులు ఉంటాయి, మరికొందరి దగ్గర గ్రేడ్ పాయింట్లు ఉంటాయి. ఈ రెండింటినీ ఎలా కన్వర్ట్ చేయాలనే విషయంపై TGSRTC, SSC బోర్డుకు లేఖ రాసింది. SSC నుండి స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు పదవ తరగతి మార్క్స్ మెమో సిద్ధంగా ఉంచుకోవాలి. SSC వెబ్‌సైట్‌లో మార్కుల కన్వర్షన్ లెక్క తెలుసుకోవాలి. TGSRTC అధికారిక వెబ్‌సైట్‌ని నిరంతరం అనుసరించాలి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తు చేయడానికి సన్నద్ధంగా ఉండాలి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com