మనవడిని కాపాడేందుకు గుంతలోకి దూకిన తాతయ్య మృతి — నల్గొండ
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గారపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఒక విషాదఘటన జరిగింది. రైతు కంటు వెంకన్న తన మనవడు హేమాన్షును బోరుబావి గుంత నుండి కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు.
యాద్గారపల్లి గ్రామ ఉపసర్పంచి కంటు నాగమ్మ, వెంకన్న దంపతుల పెద్ద కుమార్తె శ్రావణి పిల్లలు — లోహిత, హేమాన్ష్ — వేసవి సెలవులకు మూడు రోజుల క్రితం అమ్మమ్మ తాతయ్యల వద్దకు వచ్చారు. శనివారం ఉదయం వెంకన్న పిల్లలిద్దరినీ వెంట తీసుకుని పొలంలో చెట్లకు నీరు పెట్టేందుకు వెళ్ళారు.
పొలంలో ఆడుకుంటున్న హేమాన్ష్ బోరుబావి కేసింగ్ పైపు చుట్టూ భూమి కుంగిపోయి ఏర్పడిన 10 అడుగుల లోతైన గుంతలో పడిపోయాడు. వెంటనే గమనించిన వెంకన్న మనవడిని బయటికి లాగేందుకు గుంతలోకి తల పెట్టగా ఆయన కూడా లోనికి జారిపోయారు.
మనవరాలు లోహిత గుంత వద్ద నిలబడకుండా కిలోమీటరు పైగా పరుగెత్తి రోడ్డుపై వెళ్తున్న వారికి విషయం చేరవేసింది. చింతకాయల సైదులు అనే స్థానిక యువకుడు నడుముకు తాడు కట్టించుకుని గుంతలోకి దిగి ముందు వెంకన్నను, తర్వాత హేమాన్షును బయటకు తీశారు.
వెంకన్నకు CPR చేసి ambulance లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన మృతి చెందారు. హేమాన్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com