హైదరాబాద్ 29°C
అమరావతి 31°C
IST 4:50 PM
శుక్రవారం ఆగస్టు 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

జాతీయ చేనేత దినోత్సవం: చంద్రబాబు ముఖచిత్రాన్ని మగ్గంపై నేసిన దంపతులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జాతీయ చేనేత దినోత్సవం: చంద్రబాబు ముఖచిత్రాన్ని మగ్గంపై నేసిన దంపతులు
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం, లావేరు గ్రామానికి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు మగ్గంపై సీఎం చంద్రబాబు ముఖచిత్రాన్ని నేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎంకు బహుకరించేందుకు సుమారు నెల రోజుల పాటు శ్రమించి దీన్ని రూపొందించినట్టు తెలిపారు.

మీటర్ వెడల్పు, మీటర్ పొడవున ఉన్న ఈ ప్రత్యేక చేనేత వస్త్రంలో చంద్రబాబు ఫోటోతోపాటు ఆయన పేరు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల పేర్లను కూడా చేర్చారు. 2 మీటర్ల పొడవైన ప్రత్యేక శాలువాను కూడా తయారు చేశారు.

గతంలో ప్రధానమంత్రికి కూడా చేనేత దినోత్సవం నాడు ఇలాంటి వస్త్రాన్ని సమర్పించినట్టు దంపతులు తెలిపారు. చేనేత కార్మికుల పరిస్థితిపై సీఎం చర్యలు తీసుకుంటారని తాము ఈ కృషి చేశామన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com