హైదరాబాద్ 30°C
అమరావతి 34°C
IST 10:45 AM
శనివారం జూలై 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీ వరద.. మూడు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీ వరద.. మూడు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
📷 Ralph W. lambrecht / Pexels
షేర్ కాపీ అయింది ✓

కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా 1.43 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటి నిల్వ వేగంగా పెరుగుతోంది.

ప్రస్తుతం ప్రాజెక్టులో 57 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు. గతేడాది ఇదే సమయంలో 92.17 టీఎంసీల నీటి నిల్వకు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుతం రోజుకు సగటున 14 టీఎంసీల నీరు చేరుతోంది. ఇదే స్థాయిలో మరో మూడు రోజులు వరద కొనసాగితే నీటి నిల్వ 90-95 టీఎంసీలకు చేరుకుంటుందని, దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలే ఈ వరదకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఋతుపవనాలు ఆలస్యం కావడం, ఎల్నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో ఈ ఏడాది జూలైలో మాత్రమే వరద ప్రారంభమైంది.

దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు ప్రస్తుతం డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నీరు విడుదలైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షల ఎకరాల సాగుకు అవసరమైన నీరు లభించనుంది. దీంతో కృష్ణా బేసిన్ పరిధిలోని రైతులు వరద నీటి విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com