ఆంధ్రప్రదేశ్

ఏపీలో భారీ వర్షాలు: ఏలూరు, విజయవాడలో ఈదురుగాలులు, విద్యుత్ అంతరాయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏపీలో భారీ వర్షాలు: ఏలూరు, విజయవాడలో ఈదురుగాలులు, విద్యుత్ అంతరాయం
📷 A S M Atiqur Rahman / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కృష్ణ, NTR, ఉమ్మడి ఏలూరు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

విజయవాడలో రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సింగ్‌నగర్, బాంబే కాలనీ, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. జాతీయ రహదారిపై భారీ వృక్షం పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులు వీచాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మామిడి పంట నేలరాలడంతో రైతులు నష్టపోయారు. గుడివాడలోనూ ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com